వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో.. కాకతీయ దూరవిద్య డిగ్రీ,పీజీ చివరి సంవత్సర పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా జరిగాయి. కొవిడ్ కారణంగావాయిదా పడ్డ దూరవిద్య పరీక్షలు నగరంలోని పలు కేంద్రాలలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించారు.
కొన్ని నెలల తరవాత విద్యార్థులు అధిక సంఖ్యలో పరీక్షలు రాసేందుకు తరలిరావడంతో ఆయా సెంటర్ల వద్ద సందడి నెలకొంది. కొందరు చంటి బిడ్డలతో హాజరయ్యారు.
ఇదీ చదవండి:ఇకపై క్రియాశీల రాజకీయాల్లో ఉంటా: చిన్నమ్మ