గోదావరి బోటు ప్రమాదంలో మృతిచెందిన ఇద్దరి మృతదేహాలు వరంగల్ అర్బన్ జిల్లా కడిపికొండలోని స్వగ్రామాలకు చేరుకున్నాయి. మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఛైర్మన్ మర్రి యాదవ రెడ్డి మృతదేహాలకు నివాళులర్పించారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని మృతుల కుంటుంబాలకు హామీ ఇచ్చారు. ఒకే గ్రామం నుంచి వెళ్ళిన తొమ్మిది మంది గల్లంతు కావడం దురదృష్టకరమని కడియం ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: బోటు ప్రమాదంలో గల్లంతైన వారికోసం మూడో రోజు గాలింపు