రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే పడవ అని మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హన్మకొండలో స్థానిక డివిజన్ ప్రజలతో సమావేశమయ్యారు. కాంగ్రెస్, భాజపాలకు ఓటేస్తే వృథా అవుతుందని పేర్కొన్నారు. 16 ఎంపీ స్థానాలు గెలిపించి రాష్ట్రం అభివృద్ధికి తోడ్పడాలని కడియం విజ్ఞప్తి చేశారు. వరంగల్ తెరాస అభ్యర్థి పసునూరి దయాకర్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కడియం శ్రీహరి కోరారు.
ఇవీ చూడండి:'భార్యాబాధితుల గోడు సభలో వినిపిస్తా'