రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే.. కేటీఆర్ హూటాహుటిన వరంగల్ పర్యటన చేపట్టారని జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జంగా రాఘవ రెడ్డి ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతోన్న పార్టీ కార్యకర్తలను, యూనివర్సిటీ విద్యార్థులను.. మంత్రి వస్తున్నాడనే కారణంతో అక్రమంగా అరెస్టు చేశారంటూ మండిపడ్డారు. కాజీపేట్‌లో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
కేటీఆర్‌కు అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే.. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రాఘవ రెడ్డి డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో.. ఆంధ్ర వాసులు తెలంగాణను దోచుకు తిన్నారన్న మంత్రి.. ఇప్పుడు కాంట్రాక్టులన్ని వారికే ఇవ్వడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. అందరూ ఏకమై.. తెరాసకు బుద్ధిచెప్పే సమయం ఆసన్నమైందని అన్నారు.
ఇదీ చదవండి: సాగర్ ప్రచారంలో మంత్రిని నిలదీసిన ప్రైవేట్ టీచర్