ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని... ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ పేర్కొన్నారు. వరంగల్ జిల్లా హన్మకొండలో... వైబ్రాంట్స్ ఆఫ్ కలాం స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన.... పుడమి మనుగడ కోసం ప్రజలు కదలి రావాలని పిలుపునిచ్చారు. ధరణి దీక్ష పేరుతో భూమిని కాపాడలంటూ స్వచ్ఛంద సంస్థ సభ్యులు వినూత్న రీతిలో సందేశమిచ్చారు. ఈ దీక్షకు వనజీవి రామయ్య హాజరై సంస్థ సభ్యులకు మద్దతు పలికారు.
ఇవీ చూడండి: హుజూర్నగర్ ప్రజలకు రుణపడి ఉంటా: సైదిరెడ్డి