బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఎంఎల్టీ కోర్సుల్లో కన్వీనర్ కోటాలో ప్రవేశాలకు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ మొదటి విడత నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్ ( బీఎస్సీ నర్సింగ్ ) 4 ఏళ్ల డిగ్రీ కోర్స్, పోస్ట్ బేసిక్ బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్ 2 ఏండ్లు డిగ్రీ కోర్స్, బ్యాచిలర్ ఆఫ్ ఫీజియోథెరపీ (బీపీటీ), బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ బీఎస్సీ (ఎంఎల్టీ) కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
సీట్ల భర్తీకి సంబంధించిన తుది మెరిట్ జాబితాను, సీట్ల వివరాలను అధికారులు యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపరిచారు. ఈ నెల 7వ తేది ఉదయం 9 గంటల నుంచి 9వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. దివ్యాంగ అభ్యర్థులతో సహా అర్హులైన వారందరూ కోర్స్, కళాశాలల వారిగా ఆప్షన్లను నమోదు చేసుకోవాలని.. మరింత సమాచారానికి యూనివర్సిటీ వెబ్సైట్లో చూడాలని విశ్వవిద్యాలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఇదీ చదవండి: 'రెవెన్యూ ప్రత్యేక ట్రైబ్యునళ్లు హైకోర్టు ఆదేశాలు పాటించాలి'