ETV Bharat / state

నకిలీ ట్రక్‌చీటీలతో ప్రభుత్వ ఖజానాకు కన్నం.. రూ. కోటికి పైనే.!

author img

By

Published : Feb 18, 2022, 9:00 AM IST

Paddy Procurement Scam in Warangal : ధాన్యం కొనుగోళ్ల విషయంలో ట్రక్​ చీటీలు సృష్టించి రూ. కోటికి పైగా ప్రభుత్వ ఖజానాకు గండి పెట్టాడు ఓ అధికారి. కౌలు రైతుల పేరిట బోగస్​ రికార్డులు సృష్టించి ఈ దోపిడీకి పాల్పడ్డాడు. వరంగల్​ కమిషనరేట్​ పరిధిలో పారసరఫరాల కార్పొరేషన్​ దృష్టికి ఈ అక్రమం చేరడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

golmal in paddy purchasings
ధాన్యం కొనుగోళ్లలో ట్రక్​ చీటీలు

Paddy Procurement Scam in Warangal : ధాన్యం కొనుగోలు అక్రమాలకు సంబంధించి వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో తాజాగా మరో వ్యవహారం వెలుగు చూసింది. రూ. 1.05 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు తేలడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. 2020-21 ఖరీఫ్‌లో హనుమకొండ జిల్లా పలివేల్పులలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం ద్వారా 5,572 క్వింటాళ్ల ధాన్యం సేకరించినట్లు నిర్వాహకులు లెక్క చూపారు. 40 మంది రైతుల నుంచి కొన్నట్లు ట్రక్‌ చీటీలు సృష్టించారు. ఆ ధాన్యాన్ని పైడిపల్లిలోని వజ్రకవచ మిల్‌టెక్‌ రైస్‌ ఇండస్ట్రీస్‌కు తరలించినట్లు నమోదు చేశారు. ప్రభుత్వం నుంచి రూ.1.05 కోట్లు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. దీనిపై పౌరసరఫరాల కార్పొరేషన్‌కు ఫిర్యాదు అందడంతో అంతర్గతంగా విచారణ జరిపింది. 40 మంది రైతుల జాబితాలో ఇద్దరే అసలైన రైతులని తేలింది. మిగిలిన 38 మంది సాగు చేయకున్నా వారిని రైతుల జాబితాలో చేర్చినట్లు వెల్లడైంది.

కౌలు రైతుల పేరిట బోగస్‌ రికార్డులు

Irregularities in Paddy Procurement in Warangal : ఈ కేంద్రానికి ఇన్‌ఛార్జిగా వ్యవహరించిన పలివేల్పుల సహకారం సంఘం సీఈవో జాన్‌ దామోదర్‌ రైస్‌మిల్లు నిర్వాహకులతో కుమ్మక్కై ఈ తతంగం నడిపినట్లు గుర్తించారు. రైస్‌మిల్లు భాగస్వామి పిట్ల గౌతమి భర్త కుమారస్వామి పాత్ర ఉన్నట్లు తేలింది. పలువురి వద్ద కుమారస్వామి 13.5 ఎకరాల భూమి కౌలుకు తీసుకొని సాగు చేసినట్లు నకిలీ రికార్డులు సృష్టించారు. ఆయన బ్యాంకు ఖాతాల్లోకే సొమ్ము జమ కావడంతో అక్రమం నిర్ధరణ అయ్యింది. రెండు రోజుల్లోనే హసన్‌పర్తి, కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్లలో ఇలాంటి మరికొన్ని కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే సూర్యాపేట, కామారెడ్డి జిల్లాల్లోనూ ఈ తరహా కేసుల్లో అరెస్టులు జరిగాయి.

ఇదీ చదవండి : పంటల సాగులో భారీగా పెరుగుతోన్న రసాయన ఎరువుల వాడకం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.