ETV Bharat / state

బెంచీకి ఒక్కరే.. విద్యార్థులు కాదు టీచర్లే..

అధ్యాపకులు ఒక్కసారిగా విద్యార్థుల్లాగా మారారు. బెంచీకి ఒక్కరూ కూర్చొని పరీక్ష రాసినట్టుగా పేపర్లు దిద్దుతున్నారు. భౌతిక దూరం పాటిస్తూ ఇంటర్ పేపర్లు దిద్దుతున్నారు.

విద్యార్థుల్లాగా కూర్చొని పేపర్లు దిద్దుతున్న అధ్యాపకులు

author img

By

Published : May 12, 2020, 2:58 PM IST

వరంగల్ జిల్లాలో ఇంటర్​ జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. హన్మకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల, వడ్డేపల్లిలోని ప్రభుత్వ పింగళి బాలికల జూనియర్ కళాశాల, కుమార్ పల్లిలోని తోటబడి జూనియర్ కళాశాలలో మూల్యాంకనం జరుగుతోంది. కరోనా వైరస్ కారణంగా కేంద్రాల వద్ద అధికారులు అన్ని ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు.

అధ్యాపకులంతా విధిగా మాస్కులు ధరించి పేపర్లు దిద్దుతున్నారు. భౌతిక దూరం పాటిస్తూ.. బెంచికి ఒకరే కూర్చొని పేపర్లు దిద్దారు. తొలిరోజు ఆంగ్లం, గణితం, సివిక్స్ సబ్జెక్టులకు సంబంధించి జవాబుపత్రాలను మూల్యాంకనం చేశారు. ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించనున్నారు.

ఇదీ చదవండి: ఇంటర్​ జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.