కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా వైద్యాధికారిణి లలితాదేవి తెలిపారు. వరంగల్ అర్బన్ జిల్లాలో కరోనా బాధితుల కోసం పున్నమి అతిథి గృహం, కాకతీయ మెడికల్ కళాశాల, హరిత కాకతీయ, కేయూ బాలబాలికల వసతి గృహాల్లో క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సామాజిక దూరం పాటిస్తూ...స్వీయ నియంత్రణలో ఉంటేనే కరోనాను సమూలంగా కట్టడి చేయగలమంటున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి లలితాదేవి, సర్వైలెన్స్ అధికారి కృష్ణారావుతో మా ప్రతినిధి ముఖాముఖి.
ఇవీ చూడండి: రేషన్ సరే.. సామాజిక దూరం ఎక్కడ?