హనుమకొండలో నిన్న జరిగిన బహుజన సమాజ్‌పార్టీ (BSP) కార్యకర్తల సమావేశంలో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లా బీఎస్పీ కార్యకర్తల సమావేశానికి.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సహా రాష్ట్ర కో ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బానిసత్వానికి స్వస్తి చెప్పాలని.. రాజ్యాధికార సాధనకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని సూచించారు. భవిష్యత్తులో బహుజన బిడ్డలే పాలకులవుతారని పునరుద్ఘాటించారు. తమ రక్తంలో మాట తప్పే, మడమ తిప్పే లక్షణం లేదన్న ప్రవీణ్ కుమార్... తాము అంబేడ్కర్, కాన్షీరాం వారసులమని తెలిపారు. బీఎస్పీని గెలిపించాలని బహుజన దేవతలకు మొక్కాలన్న ఆయన... రాజ్యాంగం రాసిందే తమ తాత అంబేడ్కర్ అని వ్యాఖ్యానించారు. బహుజన యువత బానిసలవుతారో.. పాలకులవుతారో.. తేల్చుకోవాలని సూచించారు.
సడన్‌గా ప్రవీణ్‌కుమార్ వద్దకు వచ్చి..
అనంతరం సమావేశం ముగుస్తున్న సమయానికి.. ములుగు జిల్లా నుంచి వచ్చిన ఓ జంట.. సడన్‌గా ప్రవీణ్ కుమార్ వద్దకు వచ్చారు. తమ బిడ్డను ఆయన చేతిలో పెట్టారు. తమ చిన్నారికి పేరు పెట్టాలని కోరారు. ఈ చిన్నారిని ఎత్తుకొని ముద్డాడిన.. ప్రవీణ్‌కుమార్ తన భూజాలపై కూర్చోబెట్టుకున్నారు. 'సాహో ప్రతిజ్ఞా స్వేరో' అంటూ పాపకు పేరు పెట్టారు. ముద్దులపాపకు ముచ్చటైన పేరుపెట్టారంటూ.. సమావేశానికి వచ్చిన పలువురు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను మెచ్చుకున్నారు.
ఇదీచూడండి: rs praveen kumar: 'రాజ్యాంగం రాసిందే మా తాత.. అదేలేకపోతే నువ్వెక్కడ కేసీఆర్'