వరంగల్ పట్టణ జిల్లా భీమదేవరపల్లి మండల కేంద్రంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి వడగాలులు వీస్తుండటంతో పాటు లాక్డౌన్ వల్ల ప్రజలు రోడ్లపైకి రావడానికి భయపడుతున్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల జనసంచారం తగ్గి ఓ రకంగా కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ఉపయోగపడుతోంది.
ఈ రకంగానైనా ఎండల తీవ్రతతో బయట జనసంచారం తగ్గి వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడుతోందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి: వర్షంతో ఒక్కసారిగా చల్లబడిన హైదరాబాద్ నగరం