ప్రముఖ పుణ్యక్షేత్రం వరంగల్ అర్బన్ జిల్లాలోని ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో దర్శనాలను నేటి నుంచి పది రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ నెల 12 వరకు ఆలయంలో ఎలాంటి కార్యక్రమాలు జరగవని ఈఓ అద్దంకి నాగేశ్వరరావు తెలిపారు.
ఐనవోలులో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున... దేవాలయ అర్చకులు, సిబ్బంది శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. స్వామి వారికి నిత్య కైంకర్యాలు యథావిధిగా అర్చకులతో ఏకాంతంగా నిర్వహిస్తామని, దర్శనాలకు మాత్రం ఎలాంటి అనుమతి ఉండదన్నారు. ఈ నిర్ణయానికి భక్తులు సహకరించాలని అధికారులు కోరారు.