కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆలయాలకు భక్తుల అనుమతి నిలిపివేసిన రాష్ట్ర సర్కార్ ఈ నెల 8నుంచి దైవదర్శనాలకు పచ్చజెండా ఊపింది. ఈ సందర్భంలో దైవదర్శనానికి అనుగుణంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల శానిటేషన్ పనులను ఆలయ నిర్వహకలు పూర్తి చేశారు. ప్రస్తుతం ఆలయంలో ఎలాంటి ప్రత్యేక పూజలు జరుగవని, అమ్మవారి దర్శనానికి మాత్రమే అనుమతుంటుందని తెలిపారు. సోమవారం నుంచి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్విరామంగా ఆలయం తెరిచి ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు.
ఇవీ నిభందనలు...
60 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, 10 సంవత్సరాల లోపు పిల్లలకు ఆలయంలోనికి అనుమతి లేదని ఆలయ కార్యనిర్వహణాధికారి నాగేశ్వర్ రావు తెలిపారు. ఆలయంలో భక్తులు భౌతిక దూరం పాటించేలా అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. దేవస్థానంలోకి అనుమతించే ముందు భక్తులకు థర్మల్ స్క్రీనింగ్ చేయనున్నట్లు తెలిపారు. అలాగే శానిటైజర్, మాస్కులు తప్పనిసరి వెంట తెచ్చుకోవాలని భక్తులకు సూచించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు భక్తులు జాగ్రత్తలు పాటించాలని అలా అయితేనే లోపలికి అనుమతిస్తామని చెప్పారు.
ఇవీచూడండి: కరోనా వేళ.. చేపల కోసం పోటెత్తిన జనం