ETV Bharat / state

'చాయ్​వాలా ప్రధానంటే నేనూ సంతోషించా'

రాష్ట్రానికి అధిక నిధులు, ప్రాజెక్టులు సాధించుకోవాలంటే 16 మంది తెరాస ఎంపీలను గెలిపించాలని మంత్రి ఈటల రాజేందర్​ విజ్ఞప్తి చేశారు. వరంగల్​ అర్బన్​ జిల్లా ముల్కనూర్​లో కరీంనగర్​ ఎంపీ అభ్యర్థి వినోద్​, ఎమ్మెల్యే సతీశ్​​తో కలిసి రోడ్​షోలో పాల్గొన్నారు.

'ప్రధానిగా చాయ్​వాలా వస్తున్నారంటే నేనూ సంతోషించా'
author img

By

Published : Apr 2, 2019, 6:09 AM IST

Updated : Apr 2, 2019, 7:23 AM IST

2014లో ప్రధానిగా చాయ్​వాలా వస్తున్నాడంటే అందరితో పాటు తాను ఎంతో సంతోషించానని మంత్రి ఈటల రాజేందర్​ అన్నారు. పదవి చేపట్టిన తర్వాత మోదీ ప్రజలకు అన్యాయం చేశారని విమర్శించారు. వరంగల్​ అర్బన్​ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్​లో మంత్రి ఈటల, కరీంనగర్​ ఎంపీ అభ్యర్థి వినోద్​, హుస్నాబాద్​ ఎమ్మెల్యే సతీశ్​​ రోడ్​షో నిర్వహించారు. కారు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.

రానున్న ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే సత్తా చాటనున్నాయని కరీంనగర్ లోక్​సభ అభ్యర్థి వినోద్​ అభిప్రాయపడ్డారు. కేంద్రంలో తెరాస కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరంతరం కృషిచేస్తున్నానని మరో అవకాశం ఇవ్వాలని వినోద్​ ఓటర్లను కోరారు.16 మంది తెరాస ఎంపీలను గెలిపిస్తే రాష్ట్రానికి మరింత మేలు జరుగుతుందని నేతలు స్పష్టం చేశారు.

'ప్రధానిగా చాయ్​వాలా వస్తున్నారంటే నేనూ సంతోషించా'

ఇవీ చూడండి:పాక్ విమానాల్ని సమర్థంగా తిప్పికొట్టిన భారత్

Intro:TG_KRN_101_01_MANTHRI ETELA_ROAD SHOW_AVB_C11
FROM:KAMALAKAR 9441842417
---------------------------------------------------------------------------- వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామంలో కరీంనగర్ తెరాస ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్, మంత్రి ఈటెల, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ పార్లమెంట్ ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహించారు. తెరాస కార్యకర్తలు కోలాటాలతో నృత్యాలతో ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తెరాస ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ మాట్లాడుతూ దేశంలోని ఇతర రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీల ముఖ్య నాయకులతో మాట్లాడమని 160 ఎంపీ సీట్లు రేపు జరగబోయే ఎన్నికల్లో ఈ ప్రాంతీయ పార్టీలు గెలిచే అవకాశం ఉందని అందువల్ల తెలంగాణలో 16 ఎంపీ స్థానాలలో తెరాస అభ్యర్థులను గెలిపిస్తే కేంద్రంలో ప్రధాన మంత్రి ఎవరు నిర్ణయించడంతో పాటు తెలంగాణకు కావలసిన నిధులు కొట్లాడి తెచ్చుకోవడానికి బదులు వెంటనే తెచ్చుకునే వీలు ఏర్పడుతుందని అందువల్ల తనకు మరొక అవకాశం కల్పించి ఎంపీగా గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. అనంతరం మంత్రి ఈటెల మాట్లాడుతూ 2014లో దేశ ప్రధానిగా ఒక చాయ్ వాలా వస్తున్నాడంటే పేదలకు న్యాయం జరుగుతుందని దేశ ప్రజలతో పాటు నేను కూడా ఆలోచించానని కానీ మోడీ ప్రధాని అయిన తర్వాత పేద ప్రజలకు అభివృద్ధికి ఏమి చేయలేదని విమర్శించారు. ఏప్రిల్ ఒకటో తారీకు నుంచి పింఛన్లు 2016 లకు పెంచి అందించబోతున్నామని, అదేవిధంగా ప్రతి పేద కుటుంబం లోని కుటుంబ సభ్యులకు రానున్న రోజుల్లో ఉచిత వైద్యాన్ని అందించబోతున్నామని, ఎంపీ వినోద్ రానున్న రోజుల్లో మంత్రి అయ్యే అవకాశం ఉందని, తద్వారా ఢిల్లీలో మన రాష్ట్రం కోసం నిధులను అడిగి తెచ్చుకునే బదులు జీవో తెచ్చి వెనువెంటనే తెచ్చుకునే వీలవుతుందని తెలుపుతూ కాబట్టి కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ గారిని గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.

Body:బైట్స్

1) తెరాస కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్

2) ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్

Conclusion:వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామంలో ఎన్నికల ప్రచార ర్యాలీ
Last Updated : Apr 2, 2019, 7:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.