మొక్కలు పర్యావరణానికి దోహదపడతాయి వరంగల్ అర్బన్ జిల్లా భీమాదేవరపల్లి మండలం కొత్తకొండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో హరితహారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్ కుమార్, జిల్లా జడ్పీ ఛైర్మన్ సుధీర్ కుమార్ పాల్గొని మొక్కలు నాటారు. మొక్కలను నాటడమే కాదు వాటిని సంరక్షించి జాగ్రత్తగా పెంచాలన్నారు. అనంతరం తీజ్ ఉత్సావాలకు హాజరయ్యారు. గిరిజన యువతులతో గోధుమ నారును ఎత్తుకొని వారికి శుభాకాంక్షలు తెలిపారు.
ఇవీ చూడండి: గజ్వేల్ హోటల్లో కే'టీ'ఆర్ బ్రేక్