వరంగల్ అర్బన్ జిల్లాలో కరోనా వైరస్ తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు జిల్లాలో 419 మంది ఈ మహమ్మారి బారినపడ్డారు. 17 మంది మృతి చెందారు. 274 మంది హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు.
పలువురు ప్రజాప్రతినిధులు సైతం ఈ వైరస్ కోరల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా వరంగల్ మేయర్ గుండా ప్రకాశ్‌రావు దంపతులకు జరిపిన పరీక్షల్లో పాజిటివ్‌గా తేలినట్లు వైద్యులు నిర్ధారించారు. గ్రేటర్ వరంగల్‌లోని ఉద్యోగులనూ కరోనా కలవరపెడుతోంది. ఇంజినీరింగ్ ఉద్యాన విభాగాల్లో ఇద్దరికి వైరస్ సోకింది. ఫలితంగా వీరిని ఇటీవల కలిసిన మరి కొంతమంది సిబ్బంది ముందు జాగ్రత్తగా హోం క్వారంటైన్లో ఉన్నారు.