Houses Dismasted: వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డ్రైనేజీ నిర్మాణం పేరుతో అధికారులు ఇళ్లు కూలుస్తున్నారంటూ పట్టణవాసులు ఆందోళనకు దిగారు. అప్పులు చేసి కట్టుకున్న ఇళ్లను అక్రమంగా కూల్చి వేస్తున్నారని కన్నీరు పెట్టుకుని విలపించారు.
మున్సిపల్ అధికారులు, 60 మంది పోలీసుల పహారాలో.. 6 జేసీబీలతో ఇళ్లను తొలగించారు. అధికారులు దగ్గరుండి ఈ దారుణానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 50 ఫీట్లకు నోటీసులు ఇచ్చి, 55 ఫీట్లకు పైగా ఇళ్లు కూలుస్తున్నారంటూ వాపోయారు. అధికారులను బాధితులు అడ్డుకోగా.. పోలీసులు ఆందోళన చేస్తున్నవారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఇదీ చూడండి: ఒడిశాలో మరో బొగ్గు బ్లాకును సొంతం చేసుకునేందుకు సింగరేణి యత్నం