గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరంగల్ నగరంలోని ఓ పాత ఇంటి పైకప్పు కూలి ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. 20వ డివిజన్లోని ఇంటి పైకప్పు కూలి వృద్ధ దంపతులు గాయపడ్డారు. పై కప్పు కూలడాన్ని గమనించి ఇద్దరూ బయటకు రావటంతో స్వల్పగాయాలతో బయటపడ్డారు. స్థానికులు వెంటనే వారిని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్సను అందించారు. ఘటనలో కొంతమేర ఆస్తి నష్టం వాటిల్లిందని షఫీ వివరించారు.
ఇదీ చదవండిః ఎడతెరిపిలేని వానలు... పొంగుతున్న వాగులు.