ETV Bharat / state

'హిందీ' పేపర్​ లీకేజీ కేసు.. నేడు మరో ఐదుగురు అరెస్ట్..! - తెలంగాణ తాజా వార్తలు

hindi paper leakage case: పదో తరగతి ప్రశ్నాపత్రం కేసులో వరంగల్​ పోలీసులు మరో ఇద్దరికి నోటీసులు ఇచ్చారు. వాట్సప్​ గ్రూప్​లకు అడ్మిన్​లుగా ఉన్న ఇద్దరికి నిన్న నోటీసులు పంపించారు. ఇదిలా ఉండగా.. ఈ కేసులో నేడు మరో ఐదుగురుని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

hindi paper leakage case
హిందీ పేపరు లీకేజీ కేసులో మరో ఇద్దరికి నోటీసులు
author img

By

Published : Apr 9, 2023, 11:17 AM IST

hindi paper leakage case: ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అంశం హిందీ పేపర్ లీకేజీ. వరంగల్ జిల్లాలోని బాలుర ఉన్నత పాఠశాల నుంచి హిందీ పేపరు బయటకు రావడం పెను దుమారానికి దారితీసింది. ఈ కేసులో శనివారం మరో ఇద్దరికి పోలీసులు నోటీసులు పంపించారు. హిందీ పేపర్​ను వాట్సప్​లో షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఆ గ్రూప్​ల​కు అడ్మిన్లుగా ఉన్న ఇద్దరికి పోలీసులు నిన్న నోటీసులు పంపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ లీకేజీ వ్యవహారంపై ఇప్పటికే 25 మందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. వీరితో పాటు అనుమానం ఉన్న మరికొద్ది మందికి సైతం పోలీసులు నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని సమాచారం. ఇదే విషయంలో హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాలకు చెందిన పలువురు జర్నలిస్టులకూ నోటీసులు జారీ చేశారు పోలీసులు.

ఇదిలా ఉండగా.. ఈ కేసులో నేడు మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. లీకైన హిందీ పరీక్షా పత్రం 149 మందికి వెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వీరందరినీ విచారించే అవకాశం లేకపోలేదు. మరోవైపు ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న బండి సంజయ్​ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నాటకీయ పరిణామాల మధ్య సంజయ్​కు బెయిల్ మంజూరు కావడంతో ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు.

కోర్టును ఆశ్రయించిన విద్యార్థి: వరంగల్ జిల్లాలోని కమలాపూర్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నుంచి హిందీ పేపరు బయటకు వచ్చిందనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. అయితే ఇదే పాఠశాలకు చెందిన హరీశ్ అనే విద్యార్థి నుంచే పేపరు బయటకొచ్చింది అని తేలడం వల్ల ఆ విద్యార్థిని చీఫ్ సూపరింటెండెంట్ ఐదేళ్ల పాటు డిబార్ చేశారు. ఇంగ్లీష్ పరీక్షకు హాజరైన హరీశ్​ను పరీక్ష రాయనివ్వకుండా అడ్డుకుని పత్రంపై సంతకం చేయించుకొని పంపించారు. దీంతో విద్యార్థి బోరున విలపించాడు. హరీశ్ బాధను చూడలేక హరీశ్ తండ్రి అధికారుల నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ వేశాడు. తన కుమారుడిని బెదిరించి వేరే అబ్బాయి పరీక్షా పేపరును ఫొటో తీసుకున్నాడని హరీశ్ ఏం తప్పు చేయలేదని వివరించాడు. దీనిపై సానుకూలంగా స్పందించిన హైకోర్టు.. హరీశ్​ను మిగతా పరీక్షలు రాసేందుకు అనుమతినిచ్చింది. కేసును రెండు వారాలకు వాయిదా వేసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.