ETV Bharat / state

భాజపా సభకు హైకోర్టు అనుమతి, ఆ హామీ ఇవ్వాలని కండీషన్ - BJP meeting at Hanumakonda Arts College

భాజపా ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభకు హైకోర్టు అనుమతి

author img

By

Published : Aug 26, 2022, 5:14 PM IST

Updated : Aug 26, 2022, 6:15 PM IST

17:04 August 26

భాజపా సభకు హైకోర్టు అనుమతి, ఆ హామీ ఇవ్వాలని కండీషన్

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై ఆ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు భాజపా నేతలు ఉన్నత న్యాయస్థానంలో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై మధ్యాహ్నం 2:30 గంటలకు విచారణ జరిపిన ధర్మాసనం.. రేపటి సభ నిర్వహణకు అనుమతిచ్చింది. సభలో నేతలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయరని హామీ ఇవ్వాలని భాజపాను హైకోర్టు ఆదేశించింది.

అసలేమైందంటే..? ప్రజా సంగ్రామయాత్ర ముగింపు సందర్భంగా రేపు హనుమకొండలోని ఆర్ట్స్​ కాలేజీలో భాజపా భారీ బహిరంగ సభ తలపెట్టింది. ఈ సభకు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు కానున్నారు. అయితే ఈ సభకు అనుమతి లేదని కాలేజీ యాజమాన్యం గురువారం వెల్లడించింది. సభకు పోలీసుల అనుమతి లేదని తెలిపింది. పోలీసుల పర్మిషన్‌ లేనందున తాము అనుమతించలేమని వివరించింది.

అయితే ఇప్పటికే పోలీసులు అడ్డుకోవడంతో వాయిదా పడిన ప్రజాసంగ్రామ యాత్రకు హైకోర్టు అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో భారీ సభ నిర్వహించేందుకు సిద్ధమవుతున్న భాజపా శ్రేణులు అనుమతి నిరాకరణపై మరోసారి ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. లంచ్​ మోషన్​ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్​పై మధ్యాహ్నం 2:30 గంటలకు విచారణ జరిపిన సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం సభకు పర్మిషన్ ఇచ్చింది. సభలో నేతలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయరని హామీ ఇవ్వాలని ఆదేశించింది.

సభలు, సమావేశాలపై నిషేధం..: ఇదిలా ఉండగా.. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలపై నిషేధం విధిస్తూ వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌ జోషి ఉత్తర్వులు జారీ చేశారు. శాంతిభద్రతలను కాపాడాలనే ఉద్దేశంతో వరంగల్ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో సిటీ పోలీస్‌ యాక్ట్‌-30 ప్రకారం బహిరంగ సభలు, సమావేశాలు ర్యాలీలపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. నేటి నుంచి 31 ఉదయం 6 గంటల వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇవీ చూడండి..

భాజపా సభకు అనుమతి రద్దు, అదే కారణమన్న కాలేజీ యాజమాన్యం

దమ్ముంటే సభను అడ్డుకోండి, మా సత్తా ఎంటో చూపిస్తామన్న బండి సంజయ్​

ఆ విషయంలో బాధగా ఉందన్న జస్టిస్ రమణ, రిటైర్మెంట్​ రోజున కీలక వ్యాఖ్యలు

Last Updated : Aug 26, 2022, 6:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.