ETV Bharat / state

ఓరుగల్లులో జోరు వానలు.. కూలిన పాత ఇళ్లు...

ఏకధాటిగా కురిసిన వర్షాలు ఓరుగల్లు వాసులను ముంచేశాయి. నాలుగు రోజులుగా పడుతున్న వానకు నగరంలోని పాత ఇళ్లు, ఆలయాలు, ప్రహరీ గోడలు నేలకూలాయి. చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. పదుల సంఖ్యలో ఇళ్లు నేల కూలాయి. ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు వరంగల్​ మహా నగర పాలక సంస్థ.. సహాయం చేస్తామని భరోసానిచ్చింది.

author img

By

Published : Aug 9, 2019, 11:28 AM IST

కూలిన పాత ఇళ్లు
ఓరుగల్లులో జోరు వానలు

వరంగల్​ వాసులకు వర్షాలు నష్టాలను మిగిల్చాయి. గత నాలుగు రోజులుగా కురిసిన భారీ వర్షానికి నగరంలో రహదారులు దెబ్బతిన్నాయి. గ్రేటర్ పరిధిలోని పలు డివిజన్లలో ఇళ్లు నేలమట్టమయ్యాయి. అధిక వర్షాలకు కరీమాబాద్, ఉరుసు శివ నగర్, కాశిబుగ్గ గాంధీనగర్, రామన్నపేట, దేశాయిపేట, కిలా వరంగల్ లేబర్ కాలనీలో పదుల సంఖ్యలో ఇళ్లు నేలకూలాయి. రామన్నపేటలో మొహమ్మద్ షఫీ దంపతులు ఇంట్లో ఉండగానే ఇంటి పైకప్పు కూలడం వల్ల వృద్ధ దంపతులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాంధీనగర్​లో కరుణమ్మ ఇంట్లోని మొదటి గది పైకప్పు కూలింది. ఇంట్లోని టీవీ, నిత్యావసర వస్తువులతో పాటు ఫర్నిచర్ ధ్వంసం అయింది. కిలా వరంగల్ కోటలో స్వయంభు శివాలయం వెనుకభాగంలోని ప్రహరీ గోడ భక్తులు లేని సమయంలో నేల కూలడం వల్ల ప్రమాదం తప్పింది.

భారీగా కురుస్తున్న వర్షాలను దృష్టిలో పెట్టుకొని అధికారులు అప్రమత్తమయ్యారు. యుద్ధ ప్రాతిపదికన చెత్త, కాలనీలలో నిలిచిన వరద నీటిని తొలగించడం వంటి పనులు చేపట్టారు. ముందే చర్యలు చేపట్టడం వల్ల నష్టం భారీగా తగ్గిందని మేయర్​ గుండా ప్రకాశ్​ పేర్కొన్నారు. గ్రేటర్ పరిధిలో 900పైగా ఇళ్లు శిథిలావస్థకు చేరినట్లుగా ఆయన​ తెలిపారు. హన్మకొండలో శిథిలావస్థ స్థితిలో ఉన్న ఇంటిలో ఉంటున్న ఓ వృద్ధురాలిని మేయర్ చేరదీశారు. పాత ఇళ్లను వదిలిపెట్టాలని నగరవాసులకు అధికారులు విన్నవించారు. వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.
ఇవీ చూడండి: రెండో ప్రమాద హెచ్చరికకు చేరువలో గోదావరి ప్రవాహం

Intro:
TG_WGL_15_09_HEAVY_RAINS_HOUSES_DAMAGE_PKG_TS10076
B.PRASHANTH WARANGAL TOWN
( ) ఏకదాటిగా కురుస్తున్న భారీ వర్షాలు ఓరుగల్లు వాసులకు నష్టాలను మూట కట్టాయి గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నగరంలోని పాత ఇండ్లు ఆలయాల ప్రహరీ గోడలు నేలకులాగా చెరువులు నిండుకుండను తలపిస్తున్న అలుము పారుతున్నాయి ఇండ్లు కోల్పోయిన నిర్వాసితులకు వరంగల్ మహా నగర పాలక సంస్థ తక్షణ సహాయం చేస్తూ బాధితులకు బాసటగా నిలుస్తుంది..look

Body:vo 1 ఓరుగల్లు వాసులకు వర్షాలు నష్టాలను మిగిల్చాయి గత నాలుగు రోజులుగా కురిసిన భారీ వర్షానికి నగరంలోని రహదారులు దెబ్బతినడంతో పాటు గ్రేటర్ పరిధిలోని పలు డివిజన్లలో ఇళ్లు నేలమట్టమయ్యాయి భారీ వర్షాలకు కరీమాబాద్ ఉరుసు శివ నగర్ కాశిబుగ్గ గాంధీనగర్ రామన్నపేట దేశాయిపేట కిలా వరంగల్ లేబర్ కాలనీలో పదుల సంఖ్యలో ఇల్లు నేలకూలాయి వరుణుడి ఆక్రోశాన్ని కి కాశిబుగ్గ లోని శ్రీదేవి ఇల్లు ధ్వంసం కాగా దేశాయిపేట లోని మరో ఇల్లు కూలింది రామన్నపేటలో మొహమ్మద్ షఫీ దంపతులు ఇంట్లో ఉండగానే ఇంటి పై కప్పు నేల కూలడంతో వృద్ధ దంపతులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు గాంధీనగర్ లో కరుణమ్మ ఇంట్లోని మొదటి గది పై కప్పు కూలడంతో ఇంట్లోనే టివి నిత్యావసర వస్తువులతో పాటు ఫర్నిచర్ ధ్వంసం అయింది భూపేష్ నగర్ లోని రాజమ్మ ఇల్లు ఎవరూ లేని సమయంలో నేల కూలడంతో బాధితులు ఊపిరిపీల్చుకున్నారు కిలా వరంగల్ కోటలో స్వయంభు శివాలయం వెనుకభాగంలోని ప్రహరీ కూడా భక్తులు ఎవరు లేని సమయంలో నేల కూలడం తో ప్రమాదం తప్పయింది భారీగా కురుస్తున్న వర్షాలు దృష్టిలో పెట్టుకొని బల్దియా అధికారులు అప్రమత్తమయ్యారు నగరంలో విద్య ప్రాతిపదికన పారిశుద్ధ్య పనులను చేపట్టడంతో పాటు కాలనీలలో నిలిచిన వరద నీటిని తొలగించి అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టారు పదుల సంఖ్యలో ఇల్లు నేల కూలడంతో గ్రేటర్ పరిధిలో శిథిలావస్థకు చేరిన 900 పైగా ఇండ్లను గుర్తించినట్లు గ్రేటర్ మేయర్ గుండా ప్రకాష్ తెలిపారు హన్మకొండలోని శిథిలావస్థకు చేరిన నివాసం ఉంటున్న ఓ వృద్ధురాలు చేరదీసి ఇంటిని కూల్చి వేస్తామని మేయర్ తెలిపారు వర్షాల దెబ్బకు కోల్పోయిన వారికి తమ వంతు గా సహాయం అందిస్తామని పాత ఇళ్లను నగరవాసులు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు ఉండాలని అధికారులకు సహకరించాలని మేయర్ నగరవాసులను కోరారు
బైట్
స్వల్ప గాయాలతో బయటపడ్డ బాధితుడు
కరుణమ్మ కోల్పోయిన నిర్వాసితులు
గుండా ప్రకాష్ వరంగల్ మహా నగర పాలక సంస్థ మేయర్

Conclusion:end vo భారీ వర్షాల నేపథ్యంలో పాత ఇళ్లను వదిలేయాలని నగర పాలక సంస్థ అధికారులు నగరవాసులకు విన్నవిస్తారు వర్షాలు తగ్గుముఖం పట్టే వారికి సురక్షిత ప్రాంతాలు ఉండాలని సూచిస్తున్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.