వరంగల్లో ఈ సాయంత్రం భారీ వర్షం కురిసింది. వరంగల్, హన్మకొండ, కాజీపేట ప్రాంతాల్లో.... అరగంటకుపైగా కుండపోత వాన పడింది. దీనివల్ల రహదారులు జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగి పొర్లాయ్. మోకాల్లోతుపైగా రోడ్లపైకి వర్షపు నీరు వచ్చి చేరటం వల్ల...వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పాఠశాలల నుంచి ఇళ్లకు వెళ్లాల్సిన పిల్లలూ ఇక్కట్లు పడ్డారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా వర్షం పడింది.
ఇవీచూడండి: 'జీవోలపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు'