రాత్రి కురిసిన భారీ వర్షానికి వరంగల్ నగరంలోని ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షపు నీరు ఇళ్లలోకి చేరడం వల్ల కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లక్ష్మీ గణపతి కాలనీ, మధుర నగర్, ఎస్.ఆర్.నగర్, మైసయ్య నగర్లలో వర్షపు నీరు రోడ్లపై చేరి ట్రాఫిక్‌కి తీవ్ర అంతరాయం కల్గించింది. నిత్యవసర వస్తువులన్నీ వరద నీటిలో తడిసిపోయాయి. కాలువల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నందున పెద్ద మొత్తంలో నష్టం జరిగిందని పట్టణవాసులు తెలిపారు.
ఇవీ చూడండి: కోదండరాం, ఎల్.రమణ అరెస్ట్..