బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వరంగల్ తడిసి ముద్దయింది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎస్సార్ నగర్, మధురా నగర్, లక్ష్మీ గణపతి కాలనీలలో వరదనీరు నిలవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
వరద నీరు తొలగించేందుకు నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులు యుద్ధప్రాతిపదికన పనులను ముమ్మరం చేశారు. జేసీబీ సహాయంతో నాలాలలోని మట్టిని, వ్యర్థాలను తొలగిస్తున్నారు. అక్రమ నిర్మాణాలతో నాళాలు కుదించుకపోవడం వల్ల చిన్నపాటి వర్షానికే వరద నీరు రోడ్లపై చేరుతుందని కాలనీవాసులు ఆరోపించారు.
ఇదీ చూడండి: జర జాగ్రత్త: మనుషులకే కాదు.. కరెన్సీకి కరోనా వైరస్!