ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద జనం బారులు తీరారు. నేటి నుంచి రెండో డోసు వారికి మాత్రమే టీకా ఇస్తుండగా వరంగల్, హన్మకొండ, కాజీపేటల్లోని అన్ని కేంద్రాల వద్ద ఇవాళ రద్దీ నెలకొంది. వ్యాక్సిన్ దొరకదనే సందేహంతో జనం తరలివస్తున్నారు.
వరంగల్ అర్బన్ జిల్లాలో కొవాగ్జిన్ కేంద్రాలు కేవలం నాలుగు మాత్రమే ఉండగా... మిగతా చోట్ల కొవిషీల్డ్ వ్యాక్సిన్ ఇస్తున్నారు. రెండో డోసు వేసే క్రమంలో ప్రణాళిక లేకుండా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన సమాచారం ఇవ్వడం లేదని వాపోయారు.
ఇదీ చదవండి: కరోనా సోకిందనే భయం... పిల్లల ముందే తల్లి మృతి