నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడే వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులు లేక వెలవెలబోతుంది. కరోనా భయంతో ప్రయాణికులు బస్సులు ఎక్కడానికి జంకుతున్నారు. రద్దీ లేకపోవడం వల్ల యాజమాన్యం అద్దె బస్సులను నడపడం లేదు. ఫలితంగా అద్దె బస్సుల నిర్వహణ, రుణ వాయిదాల చెల్లింపు యజమానులకు భారంగా మారింది.
వరంగల్ ఆర్టీసీ రీజియన్లోని తొమ్మిది డిపోల పరిధిలో మొత్తం 964 బస్సులు ఉండగా... వీటిలో 380 అద్దె బస్సులు ఉన్నాయి. ఈ అద్దె బస్సులన్నిటినీ సంస్థ మైదానానికే పరిమితం చేసింది. మరో వైపు ఆర్టీసీ తమ బకాయిలను విడుదల చేయడంలో తీవ్ర జాప్యం చేస్తోందని అద్దె బస్సుల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫైనాన్స్ సంస్థల ఒత్తిడితో అప్పులు చేయాల్సి వస్తోందని చెబుతున్నారు. కరోనా సమయంలో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చూడండి: ఆదివారం కరోనా పరీక్షలకు ఆటంకం.. మూడొంతుల కేంద్రాల మూత