Handicapped Woman Story at Siddapur in Hanamkonda : ఓ వైకల్యం ఉన్న యువతి తన పరిస్థితి గురించి ఆలోచించి బాధపడలేదు.. అందరిలా తాను ఎందుకు జీవితంలో ముందుకు సాగలేనని ఆత్మవిశ్వాసంతో అడుగులు వేసింది. దీంతో ఆమె తనతో పాటు పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది. హనుమకొండ జిల్లా, హసన్‌పర్తి మండలం.. సిద్దాపూర్‌కు చెందిన యువతి పేరు శ్రీలత. పుట్టుకతోనే దివ్యాంగురాలు. ఆత్మవిశ్వాసానికి నిలువత్తు రూపం. 2007లో తల్లి అనారోగ్యానికి గురై మరణించింది. తల్లి చనిపోయిన నాలుగేళ్లకే.. తండ్రి కూడా తనువు చాలించాడు. తల్లిందండ్రుల మృతితో అంతులేని ఆవేదనే మిగిలింది. ఓ వైపు వైకల్యం.. మరో వైపు ఒంటరితనం వెంటాడుతూనే ఉన్నాయి. అయినా ధైర్యం కోల్పోలేదు. చుట్టుముట్టిన కష్టాలతో చావే నయం అనుకుని.. ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడలేదు. చదువుకుని ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. ఆర్ధిక పరిస్ధితి కారణంగా.. చదువు మధ్యలోనే ఆపేయాల్సివచ్చింది. సోదరి, సోదరుడు ఉన్నా.. వారు పట్టించుకోకపోవడంతో కుంగిపోకుండా.. ఆత్మవిశ్వాసంతో జీవిస్తోంది.
విధిరాతను ఎదిరించి.. పెయింటింగ్‌లో అద్భుతాలు
Physical Handicaped Sri Latha Article in Hanamkonda : తల్లిదండ్రులు మృతి చెందాక.. తొబుట్టువులు పట్టించుకోక పోవడంతో రూ.50 వేలు వడ్డీకి తెచ్చి.. ఓ చిన్న వస్త్ర దుకాణం పెట్టుకుని జీవిస్తున్నానని చెబుతోంది శ్రీలత. ఇంటి పనులు పూర్తి చేసుకుని.. వస్త్ర దుకాణానికి నడుచుకుంటూ వెళ్లి, సాయంత్రం వరకు ఉంటుంది. సరైన ఇల్లు కూడా లేక పోవడంతో.. ఉన్న చిన్నపాటి రేకుల షెడ్డులోకి వర్షం నీళ్లు చేరుతున్నాయని ఆవేదన చెందుతుంది. ఎంతోమందికి దళిత బంధు వచ్చింది కానీ.. తనకు మాత్రం రాలేదని.. కనీసం మూడు చక్రాల బండి కూడా లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. దుకాణం అద్దె కట్టడం, తెచ్చిన డబ్బుకు వడ్డీ కట్టడంతో ఆర్థికంగా అవస్థలు పడుతన్నానని వాపోతోంది. ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న శ్రీలతకు ప్రభుత్వం సాయం అందిస్తే.. తనలాంటి వారికి ఉపాధి కల్పిస్తానంటోంది.
చదువుకునే స్థోమత లేక డిగ్రీ సెకండ్ సంవత్సరం విద్య ఆపేశాను. నా తల్లిదండ్రులు చాలా బాగా చూసుకున్నారు. వారు చనిపోయిన తరవాత ఎవరి మీద ఆధారపడ లేదు. నా పనులన్ని నేను సొంతంగా చేసుకోగలను. డబ్బులు వడ్డీకి తెచ్చుకుని చిన్న బట్టల షాపు పెట్టుకున్నాను. అక్కడే నాకు కాలక్షేపం అవుతోంది. ఇంటి దగ్గర అన్ని పనులు పూర్తి చేసుకుని దుకాణానికి వెళతాను. రాష్ట్రంలో కురిసిన వర్షాలకి ఇళ్లు అంతా నిండిపోయింది. దీంతో రేకుల షెడ్డలో ఉంటున్నాను. దుకాణానికి అద్దె కట్టడం.. ఇలాంటి ఆర్థిక ఇబ్బందుల వల్ల సమస్యలు పడుతున్నాను. నాకు దళిత బంధు రావడం లేదు. ప్రభుత్వం సాయం చేయాలని కోరుతున్నాను. దాతలు, ప్రభుత్వం స్పందిస్తే నాలాంటి ఎంతోమందికి ఉపాధి కల్పిస్తాను. - శ్రీలత, హనుమకొండ
Handicapped SAMBA LAXMI Story : విధిరాతకు ఎదురీదుతున్న దివ్యాంగురాలు
అంగ వైకల్యం శరీరానికే.. ఆత్మవిశ్వాసానికి కాదు
అంగవైకల్యాన్ని ఓడించిన యువతి.. నెట్ పరీక్షలో 99 శాతం స్కోర్