ETV Bharat / state

కాంగ్రెస్​లో గ్రూపు రాజకీయాలు.. రేవంత్​ ఎదుటే ఘర్షణ పడ్డ ఇరు వర్గాలు - Conflicts between two groups in Hanamkonda

Conflicts between two groups in Hanamkonda: హనుమకొండలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి ఎదుటే కాంగ్రెస్ వర్గీయులు ఘర్షణ పడ్డారు. రాహుల్ గాంధీ పర్యటన సందర్బంగా ఆర్ట్స్ కళాశాల మైదానాన్ని రేవంత్ రెడ్డి బృందం పరిశీలిస్తుండగా... జంగా రాఘవరెడ్డి, నాయిని రాజేందర్​ రెడ్డి ఘర్షణకు దిగారు. పార్టీ అధినేత ఎదుటే ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దురుసుగా ప్రవర్తించారు.

Conflicts between two groups in Hanamkonda:
రేవంత్​ రెడ్డి ఎదుటే ఇరు వర్గాల కొట్లాట
author img

By

Published : Apr 21, 2022, 7:30 PM IST

Conflicts between two groups in Hanamkonda: పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముందే వరంగల్ కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు బయటపడ్డాయి. జనగామ జిల్లా కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పరస్పరం తోపులాటలకు దిగి.. ఒకరిపై మరొకరు దాడికి పాల్పడ్డారు. వచ్చే నెల 6న రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా హనుమకొండ ఆర్ట్స్​ కళాశాల మైదానంలో జరగనున్న సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు రేవంత్​ బృందం వెళ్లింది.

ఓవైపు రేవంత్​ బృందం సభ ఏర్పాట్లు పరిశీలిస్తుండగానే.. రెండు వర్గీయుల మధ్య గలాటా చోటుచేసుకుంది. రేవంత్ రెడ్డి ముందు బలప్రదర్శనకు దిగడంతో.. రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. హనుమకొండ పార్టీ టికెట్​ను నాయని రాజేందర్ రెడ్డి ఎప్పట్నుంచో ఆశిస్తుంటే.. ఇటీవలే తాను కూడా రేసులో ఉన్నట్లు జంగా రాఘవరెడ్డి చెప్పడంతో వివాదం మొదలైంది. ఇది కాస్తా పార్టీ అధినేత ముందే... ఘర్షణకు దారితీసింది. గత కొన్ని రోజులుగా జంగా రాఘవరెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి మధ్య విభేదాలు ఉన్నాయి. అవి ఇప్పుడు బహిర్గతమయ్యాయి.

రేవంత్​ రెడ్డి ఎదుటే బయటపడిన గ్రూపు రాజకీయాలు

ఇవీ చదవండి: కేసీఆర్‌ను గద్దె దించే బాధ్యత యువకులు తీసుకోవాలి: రేవంత్‌రెడ్డి

ట్రైన్ నిమిషం లేట్.. డ్రైవర్ జీతం కట్.. కోర్టులో వాడీవేడి వాదనలు.. చివరకు...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.