ETV Bharat / state

'బువ్వ పెట్టే భూమి పోతే మా బతుకులెట్లా సారూ..?' - గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే భూ వివాదం

Greenfield National Highway land issue : ఏడాదికి మూడు పంటలు పండే పచ్చని పొలాలను జాతీయ రహదారి కోసం సేకరించేందుకు అధికారులు శరవేంగా సర్వేలు చేస్తున్నారు. విజయవాడ నుంచి నాగపూర్ వరకు గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవేలో భూములు కోల్పోతున్న అన్నదాతల కుటుంబాలు తల్లడిల్లుతున్నాయి. బతుకుదెరువైన పొలాలు లేకుంటే... జీవించడమెలా అని ప్రశ్నిస్తున్నారు. భవిష్యత్‌నిచ్చే ధరణి కోసం ప్రాణాలైనా అర్పిస్తామని తెగేసి చెబుతున్నారు.

Greenfield  National Highway land issue
Greenfield National Highway land issue
author img

By

Published : Jan 7, 2023, 10:16 AM IST

బువ్వ పెట్టే భూమి పోతే మా బతుకులెట్లా సారూ

Greenfield National Highway land issue : హనుమకొండ జిల్లాలోని కొన్ని గ్రామాల మీదుగా విజయవాడ-నాగ్‌పూర్‌ గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే వెళ్తుంది. భూసేకరణకు అధికారులు సర్వే చేపట్టారు. తమ అనుమతి లేకుండానే ప్రక్రియ కొనసాగుతుందని రైతులు ఆరోపిస్తున్నారు. హైవేకు భూములిచ్చేది లేదంటూ కొద్దిరోజులుగా నిరసనలు, ధర్నాలతో హోరెత్తిస్తున్నారు. మూడు పంటలు పండే సాగు భూములను అభివృద్ధి పేరుతో లాక్కోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కోట్లు విలువచేసే పొలాలు ఇచ్చేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే సర్వే ప్రారంభమైనప్పటి నుంచి కర్షకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సంబంధిత అధికారులు మాత్రం అవేమీ పట్టించుకోకుండా సర్వేలు కొనసాగిస్తూనే ఉన్నారు. దామెర మండలం ఊరుగొండ వద్ద 163వ జాతీయ రహదారిపై బైఠాయించి.. భూ నిర్వాసితులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అప్పట్లో కాస్త వెనక్కి తగ్గిన యంత్రాంగం... మళ్లీ తాజాగా గుట్టుచప్పుడు కాకుండా డ్రోన్ సాయంతో సర్వే చేపట్టింది. కడుపుమండిన అన్నదాతలు డ్రోన్ సర్వేను అడ్డుకున్నారు.

"నాకున్నది నాలుగెకరాలు.. గ్రీన్‌ఫీల్డ్ వల్ల మూడెకరాల భూమి పోతంది. కోటిరూపాయలకు ఎకరం అమ్ముడుపోతుంది. కానీ ప్రభుత్వం ఇచ్చే పరిహారం అందులో సగం కూడా లేదు. వాళ్లిచ్చే పరిహారంతో బయట మేము భూములు కొనుక్కునే పరిస్థితి లేదు." - ఓ రైతు

"మా పిల్లలు పెళ్లికి ఎదిగిండ్రు. వాళ్ల పెళ్లి, భవిష్యత్‌ కోసం ఎంత కష్టమైన నష్టాలొస్తున్నా వ్యవసాయం చేస్తున్నాం. అట్ల సాగు చేసుకునే భూమిని ఇప్పుడు రోడ్డు కోసం తీసుకెళ్తున్నారు. భూమి లేకపోతే మా భవిష్యత్ ఏంటి..? భూమి లేకుండా ఎంత కష్టపడినా మా కుటుంబాలను పోషించుకోలేం. మమ్మల్ని ఆగం చేస్తుండ్రు. మా ప్రాణాలైనా వదులుతం కానీ భూమి ఇవ్వం." - రైతులు

భూమినే నమ్ముకుని వ్యవసాయం చేసే కుటుంబాలు.. హైవే కారణంగా రోడ్డున పడే పరిస్థితి ఎదురైందని వాపోతున్నారు. తమ భూములకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా రోడ్డును ఎంతైనా విస్తరించుకోమని చెబుతున్నారు. ఇప్పటికైనా తక్షణం గ్రీన్‌ఫీల్డ్ హైవే సర్వే పనులు ఆపాలని అధికారులను వేడుకుంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.