ETV Bharat / state

Vegetables: పచ్చిమిర్చి, బెండకాయ ఎలా రంగు మారాయో చూడండి - వరంగల్​ అర్బన్​ జిల్లా వార్తలు

పచ్చిమిర్చి ఏ రంగులో ఉంటుంది.. ఆకుపచ్చ రంగులో.. మరి బెండకాయ.. అది కూడా ఆకుపచ్చ రంగులోనే ఉంటుంది. తెలిసింది ఏం చెబుతావు విషయానికి రండి అంటారా.. ఆగండి అక్కడికే వస్తున్నా.. సాధారణంగా పచ్చిమిర్చి, బెండకాయ ఆకుపచ్చ రంగులో ఉంటాయి. కానీ మీరు ఇప్పుడు చూడబోయే పచ్చి మిర్చి వంకాయ రంగు, బెండకాయ ఎర్ర రంగులో ఉంటాయి.. మరి ఇవీ ఎక్కడ పండిస్తున్నారో చూద్దాం పదండి...

green chilly, lady figure
పచ్చిమిర్చి, బెండకాయ
author img

By

Published : Jul 21, 2021, 3:15 PM IST

Updated : Jul 21, 2021, 3:52 PM IST

Vegetables: పచ్చిమిర్చి, బెండకాయ ఎలా మారాయో చూడండి

కూరగాయాలు రకరకాల రంగుల్లో ఉంటాయి. క్యాబ్సికం రెండు, మూడు రంగుల్లో ఉంటుంది. వంకాయ రెండు రంగుల్లో ఉంటుంది. బెండకాయ ఒకే రంగులో ఉంటుందని తెలుసు. కానీ బెండకాయ రెండు రంగుల్లో ఉంటుందని మీకు తెలుసా.. పచ్చిమిర్చి వంకాయ రంగుల్లో ఉంటుందని తెలుసా..? మరి ఇవీ ఎక్కడ పండిస్తున్నారో తెలుసా.. మన తెలంగాణలోనే అదీ వరంగల్​ అర్బన్​ జిల్లాలోనే..

మిద్దెతోటపై సాగు

కరోనా తరువాత అందరిలో ఆరోగ్య స్పృహ పెరిగింది. బయట తినడం తగ్గించేశారు. ముఖ్యంగా ఇంటి ఆవరణలోనో... మిద్దెపైనో కూరగాయల పెంపకంపైన చాలా మంది.. ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారు. హన్మకొండకు చెందిన ఓ పెద్దాయన ఇంటిపైన మిద్దెసాగు చేసి.. పండ్లు, కాయగూరలు పండిస్తున్నారు. ఇక ఇక్కడ వంకాయ రంగులో కనిపించే చిట్టి పచ్చి మిరపకాయలు చూపరులను కట్టపడేస్తున్నాయి. రేగుపండంత సైజులో కొన్ని పొడుగ్గా మరికొన్ని గుండ్రంగా ఉండడమే కాదు.. ఒక్కో మొక్కకు 30 నుంచి 40 వరకు మిరపకాయలు కాస్తున్నాయి. ఇవి కూడా సాధారణ మిరపకాయల్లాగే కారం ఉంటాయని ఇంటి యజమాని చెబుతున్నారు.

మిరపకాయాలు పండించాలంటే ఎక్కువగా పురుగు మందులు కొట్టాలి. అందుకే సేంద్రీయ పద్ధతిలో నేను మిర్చి పండిస్తున్నాను. సైజు చిన్నగా ఉన్నా కారం ఉంటాయి. మిత్రుల సహకారంతో ఈ మిద్దెతోట సాగు చేస్తున్నాను. ప్రస్తుతానికి ఇంటి వరకు మాత్రమే పండిస్తున్నాను.

-ఇంద్రారెడ్డి, హన్మకొండ

ఎర్ర బెండకాయ

వరంగల్ అర్బన్ జిల్లా హసన్​పర్తి మండలం పెంబర్తి గ్రామానికి చెందిన ఓ రైతు తన తోటలో వేసిన ఎర్ర బెండకాయలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. కొంత సాధారణ బెండకాయలు సాగు చేయగా... మిగతాదంతా ఎర్రటి బెండనే పండిస్తున్నారు. పూర్తిగా సేంద్రీయ పద్ధతిలో పెంచటంతో వీటి కాపు బాగా వచ్చింది. తోటంతా ఎర్రటి బెండకాయులు కంటికి ఇంపుగా కనిపిస్తున్నాయి. రోజు విడిచి రోజు పది కిలోల దాక దిగుబడి వస్తోంది. మంచి రుచి కూడా ఉండటంతో ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నారని రైతు తెలిపారు. చీడపీడలు కూడా తక్కువేనంటున్నాడు. కాయగూరలు ఏ రంగైనా.. ధర ఎంతైనా.. పూర్తిగా సేంద్రీయ పద్ధతుల్లో పెంచినవాటిపైనే కొనుగోలుదారులు ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తున్నారు.

పచ్చ బెండకాయ, ఎర్ర బెండకాయకు 80 శాతం తేడా ఉంటుంది. ఎర్ర బెండకాయలో బంక ఉండదు. రుచి కూడా బాగా ఉంటుంది. ఆరోగ్యానికి మంచిది. ఎర్ర బెండకాయ కొనడానికి వినియోగదారులు ముందుకు వస్తున్నారు. ఎర్ర బెండకాయ సాగు చేయడం ఇది రెండోసారి.

-ప్రభాకర్, రైతు, వరంగల్

ఇదీ చదవండి: Sharmila: పోడు భూములపై పోరాటానికి సిద్ధమైన వైఎస్​ షర్మిల

Last Updated : Jul 21, 2021, 3:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.