వరంగల్ మహానగర పాలక సంస్థ డివిజన్ల పునర్విభజన ముసాయిదాను బల్దియా కమిషనర్ పమేలా సత్పతి విడుదల చేశారు. పలుమార్లు వాయిదాల అనంతరం ముసాయిదాను ఎట్టకేలకు కమిషనర్ క్యాంపు కార్యాలయంలో విడుదల చేస్తున్నట్లు ప్రకటనలో వెల్లడించారు.
58 డివిజన్లతో కూడిన వరంగల్ మహానగర పాలక పరిధిని 66 డివిజన్లకు పెంచుతూ ముసాయిదాను విడుదల చేశారు. ముసాయిదాపై ఎలాంటి అభ్యంతరాలు ఉన్న వారం రోజుల వ్యవధిలో తెలపాలని స్పష్టం చేశారు.
![ముసాయిదా](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-wgl-19-16-delimitation-drafit-vedudhala-av-ts10076_16032021232310_1603f_1615917190_332.jpg)