ETV Bharat / state

ఘనంగా భద్రకాళీ అమ్మవారితో వీరభద్రుడి కల్యాణం - ఘనంగా భద్రకాళీ అమ్మవారితో వీరభద్రుడి కల్యాణం

ఉత్తర తెలంగాణలోనే ప్రసిద్ధి గాంచిన కొత్తకొండ వీరభద్రుని బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే స్వామివారి కల్యాణాన్ని కన్నులపండువగా జరిపించారు.

kalyanam
ఘనంగా భద్రకాళీ అమ్మవారితో వీరభద్రుడి కల్యాణం
author img

By

Published : Jan 11, 2020, 10:41 AM IST

వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే తొలుత స్వామివారికి ఆలయంలో దివ్యాలంకరణ చేశారు. అనంతరం అంకురార్పణ, ధ్వజపటలం, ధ్వజమాలాయుక్తంగా నందీశ్వరునితో ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వీరభద్ర స్వామి కల్యాణం కోసం స్వామి వారికి, భద్రకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను తీసుకొచ్చారు స్థానిక ఎమ్మెల్యే ఒడితెల సతీశ్ కుమార్.

ముందుగా మహోత్సవ వేడుకలలో గణపతి పూజ నిర్వహించి వీరభద్ర స్వామి వారి పక్షాన ఆలయ ప్రధానార్చకులు కల్యాణ తంతు నిర్వహించారు. అదేవిధంగా భద్రకాళి అమ్మవారి పక్షాన స్థానిక హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్, ఆలయ ఇఓ సులోచన వీరభద్ర స్వామి వారి కల్యాణానికి పట్టు వస్త్రాలతో పాటు ముత్యాల తలంబ్రాలు సమర్పించుకొని కన్యాదానం చేశారు. తదనంతరం అర్చకులు మాంగళ్యధారణ చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగానే ఈ నెల 18వ తేదీన అగ్నిగుండాల కార్యక్రమాన్ని నిర్వహించునన్నారు.

ఘనంగా భద్రకాళీ అమ్మవారితో వీరభద్రుడి కల్యాణం

ఇవీ చూడండి: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది సజీవదహనం

Intro:TG_KRN_101_11_VIRABADHRA_SWAMY_KALYANAM_AV_TS10085
REPORTER:KAMALAKAR9441842417
-----------------------------------------------------------
*ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ప్రసిద్ధి గాంచిన కొత్తకొండ వీరభద్రుని* *బ్రహ్మోత్సవాల్లో భాగంగా వీరభద్ర స్వామి భద్రకాళి కల్యాణ మహోత్సవ వేడుకలు శైవాగయుక్త ప్రకారం* *శుక్రవారం సాయంత్రం* *ఆహ్లాదకర వాతావరణంలో అత్యంత ఘనంగా జరిగాయి*

వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ వీరభద్ర బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలుత స్వామివారికి ఆలయంలో దివ్యాలంకరణ గావించారు. అనంతరం అంకురార్పణ, ధ్వజపటలం, ధ్వజమాలాయుక్తంగా నందీశ్వరునితో ధ్వజారోహణ గావించారు. వీరభద్ర స్వామి కల్యాణంలో భాగంగా స్వామివారికి, భద్రకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలతో కొత్తకొండ ఆలయం నుండి తోడ్కొని ఉత్సవమూర్తులను ఎమ్మెల్యేతో పాటు అర్చకులు కల్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు. ముందుగా మహోత్సవ వేడుకలలో గణపతి పూజ నిర్వహించి వీరభద్ర స్వామి వారి పక్షాన ఆలయ ప్రధానార్చకులు కల్యాణ తంతు నిర్వహించారు. అదేవిధంగా భద్రకాళి అమ్మవారి పక్షాన స్థానిక హుస్నాబాద్ఎమ్మెల్యే సతీష్ కుమార్, ఆలయ ఇఓ సులోచన నిల్చొని వీరభద్ర స్వామి వారి కళ్యాణానికి పట్టు వస్త్రాలతో పాటు ముత్యాల తలంబ్రాలు సమర్పించుకొని కన్యాదానం చేశారు. తదనంతరం అర్చకులు మాంగళ్యధారణ చేశారు. బ్రహ్మోత్సవాలలో విశేషంగా హాజరైన వారికి స్వామివారి భద్ర కంకణాన్ని వేలాది మంది భక్తులకు తరింపజేశారు. వీరభద్ర కంకణం ధరించిన వారికి నరఘోష, శత్రుఘోష, సమస్త బాధలు తొలుగుతాయని భక్తులు పెద్దఎత్తున కంకణాలు ధరించుకున్నారు. ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల 18వ తేదీ న భక్తుల అగ్నిగుండాల ప్రవేశంతో ముగుస్తాయి.Body:వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలోConclusion:ప్రారంభమైన శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు మొదటి రోజు స్వామివారి కల్యాణం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.