వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. హన్మకొండలోని గోకుల్ నగర్‌లో యాదవ సంఘం ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పాల్గొని సందడి చేశారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ఊట్టి కొట్టారు. ఆనంతరం యువకులు పోటాపోటీగా ఊట్టి కొట్టారు. యువకులపైకి నీళ్లు చల్లుతుంటే వాటిని అధిగమించి పైకి ఎక్కి ఊట్టిని కొట్టారు. వేడుకలను చూడటానికి నగర వాసులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
ఇవీ చూడండి : రాష్ట్ర స్థాయి టీ10 పోటీలు ప్రారంభించిన మంత్రి