ETV Bharat / state

వరంగల్​లో 'ఆజాద్ కా అమృత్ మహోత్సవాలు' ప్రారంభించనున్న గవర్నర్

author img

By

Published : Mar 11, 2021, 7:56 PM IST

'ఆజాద్ కా అమృత్ మహోత్సవాలు' శుక్రవారం నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి. వరంగల్​లోని పోలీస్ పరేడ్ మైదానంలో గవర్నర్ తమిళి సై జాతీయ జెండా ఎగురవేసి వేడుకలను ప్రారంభిస్తారని అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ ప్రమోద్ కుమార్​తో కలిసి కలెక్టర్ పరిశీలించారు.

governor-tamil-sai-soundarajan-will-inaugurate-azad-ka-amrit-mahotsav-at-warangal-police-parade-ground-on-friday
వరంగల్​లో 'ఆజాద్ కా అమృత్ మహోత్సవాలు' ప్రారంభించనున్న గవర్నర్

75 ఏళ్ల స్వాతంత్య్ర సంబురాలకు గుర్తుగా నిర్వహించనున్న 'ఆజాద్ కా అమృత్ మహోత్సవాలు' శుక్రవారం నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ వరంగల్​లోని పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ జెండా ఎగురవేసి వేడుకలను లాంఛనంగా ప్రారంభిస్తారని అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. సంబంధిత ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ ప్రమోద్ కుమార్​తో కలిసి కలెక్టర్ పరిశీలించారు.

'శుక్రవారం ఉదయం పుదుచ్చేరి నుంచి హైదరాబాద్​కు గవర్నర్ ప్రత్యేక విమానంలో రానున్నారు. కొంత సమయం తర్వాత బేగంపేట విమానాశ్రయం నుంచి వరంగల్​కు బయలుదేరుతారు. ఉదయం 11 గంటలకు ఉత్సవాలను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు కార్యక్రమాన్ని ముగించుకుని తిరిగి హైదరాబాద్ వెళ్తారు.' అని కలెక్టర్ తెలిపారు.

మార్చి 12 నుంచి 2022 ఆగస్టు 15 వరకు 75 వారాల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు. దీని కోసం సీఎం కేసీఆర్​ రూ.25 కోట్లు కేటాయించారు. ఉత్సవాల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి. రమణాచారి వ్యవహరిస్తారు.

ఇదీ చూడండి: పిల్లలమర్రి శైవక్షేత్రాన్ని దర్శించుకున్న మంత్రి జగదీశ్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.