ETV Bharat / state

అంతర్జాతీయ వర్చువల్ సెమినార్​లో పాల్గొన్న గవర్నర్ - గవర్నర్​ తమిళిసై

ఆన్​లైన్ విద్యకు ఎవరూ దూరం కాకూడదని, విద్య అందరికీ అందాలని.. ఆ దిశగా విద్యా సంస్థలు, విద్యా వేత్తలు కృషి చేయాలని గవర్నర్ తమిళిసై పిలుపునిచ్చారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో లేనందున అక్కడి విద్యార్ధులకు ఆన్‌లైన్‌ విద్య దూరమవుతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్నోవేషన్స్ ఫర్ న్యూ నార్మల్ అనే అంశంపై జరుగుతున్న మూడు రోజుల అంతర్జాతీయ వర్చువల్ సెమినార్‌లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

Governor Participaated in International seminar

author img

By

Published : Aug 24, 2020, 12:45 AM IST

వరంగల్ గ్రామీణ జిల్లా పరకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఇన్నోవేషన్స్​ ఫర్​ న్యూ నార్మల్​ అనే అంశంపై జరుగుతున్న మూడురోజుల అంతర్జాతీయ సెమినార్​లో గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ పాల్గొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరూ ఆన్​లైన్​ విద్యకు దూరం కావొద్దని, విద్య అందరికీ అవసరం అని.. విద్యా సంస్థలు, విద్యావేత్తలు ఆ దిశగా కృషి చేయాలని ఆమె అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్​, స్మార్ట్​ఫోన్ సౌకర్యం లేక చాలామంది విద్యార్థులు ఆన్​లైన్​ విద్య అందడం లేదన్నారు.

ఈ సెమినార్లో కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమీషనర్ నవీన్ మిట్టల్, ఐఐఎం ఆచార్యులు శ్రీనివాస్, వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీ ఆచార్యులు గిరిజా శంకర్‌లతోపాటు దాదాపు 200 మంది పత్ర సమర్పకులు పాల్గొన్నారు. నేషనల్ రిక్రూట్​మెంట్ ఏజెన్సీ, ఎన్ఆర్ఏ ఏర్పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల ప్రక్రియలో పెద్ద మార్పు అని గవర్నర్​ అన్నారు. ఎన్ఆర్ఏ ద్వారా ఏటా 1.35 లక్షలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ అవుతాయని, అందుకోసం రెండున్నర నుంచి మూడు కోట్ల మంది అభ్యర్ధులు పోటీ పరీక్షలకు హాజరవుతారన్నారు. రానున్న రోజుల్లో ఎన్ఆర్ఏ ద్వారా ఎంతోమంది నిరుద్యోగులకు ఇబ్బందులు తొలగుతాయన్నారు.

ఇదీ చూడండి: గణేషుడికీ ఓ పార్కు, మ్యూజియం ఉన్నాయి.. అవి ఎక్కడో తెలుసా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.