రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ వరంగల్ పట్టణ జిల్లా కేంద్రంలోని హన్మకొండ బస్టాండ్ జంక్షన్ అభివృద్ధి పనులను ప్రారంభించారు. సుమారు రూ. కోటి 90 లక్షలతో చేపట్టిన ఈ అభివృద్ధి పనులను అతి త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు.
గతంలో వర్షపు నీరు రోడ్ల మీద నిలిచి రహదారులు గుంతలతో నిండి ఇబ్బందికరంగా ఉండేదని వినయ్ భాస్కర్ గుర్తు చేశారు. అలాగే హన్మకొండలో ఉన్న ఇతర అభివృద్ధి పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి నగరవాసులకు అందుబాటులో ఉంచుతామని హామీ తెలిపారు.
ఇదీ చూడండి: చండీహోమం పూర్ణాహుతిలో పాల్గొన్న కేసీఆర్ దంపతులు