వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం హన్మకొండలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు కన్నులపండువగా జరిగాయి. జన్మాష్టమిని పురస్కరించుకుని సుప్రసిద్ధ వేయి స్తంభాల ఆలయంలో రుద్రేశ్వరుణ్ణి శ్రీ కృష్ణుని అవతారంలో ఆలయ అర్చకులు అలంకరించారు.
ఆలయ అర్చకులు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో 51 కిలోల పెరుగు అన్నం, మందార పువ్వులతో స్వామిని కృష్ణుడి రూపంలో అలంకరించారు. కృష్ణావతారంలో ఉన్న రుద్రేశ్వరుణ్ని దర్శించుకున్న భక్తులు తన్మయత్వంలో మునిగితేలారు.
ఇదీ చూడండి: హైదరాబాద్కు 200 టన్నుల అమోనియం నైట్రేట్!