మున్సిపల్ పర్ఫమెన్స్ ఇండెక్స్, ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ అంశాలపై ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలపాలని వరంగల్ మహా నగర పాలక సంస్థ కమిషనర్ పమేలా సత్పతి కోరారు. ఈజ్ ఆఫ్ లివింగ్ 2019లో చేసిన పనుల ఆధారంగా 2020లో నగరంలో సిటిజన్ పార్టిసిపేషన్ అడుగుతున్నామన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పోటీల్లో పలు అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. అందుకు హోర్డింగ్లతోపాటు సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వెబ్సైట్లో వరంగల్ మహా నగరం యొక్క స్థితిగతులు, ఏడాది పాటు బల్దియాలో జరిగిన అభివృద్ధి పనులు, తదితర అంశాలపై ప్రత్యేకంగా 24 ప్రశ్నలు పొందుపరచారని పేర్కొన్నారు. ఆ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించి తమ అభిప్రాయాలను తెలపలన్నారు. దేశంలోని ప్రధాన నగరాలు పలు అంశాలలో పోటీ పడుతున్నాయని కమిషనర్ అన్నారు. ఈరోజు ప్రారంభమైన ఫీడ్ బ్యాక్ ఈనెల చివరి వరకు ఉంటుందన్నారు.
ఇదీ చూడండి : ఎందుకు ఇంకా పూర్తి చేయలేదు: మంత్రి ప్రశాంత్ రెడ్డి