వరంగల్ అర్బన్ జిల్లా భద్రకాళి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణమాసం, శుక్రవారం కలిసి రావడం వల్ల అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ అమ్మవారిని దర్శించుకునేందుకు అవకాశం కల్పించారు. మాస్కులు ధరించిన వారినే లోపలికి అనుమతిస్తున్నారు. భౌతిక దూరం పాటించే విధంగా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ కారణంగా ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలను అధికారులు రద్దు చేశారు.
ఇవీ చూడం ఇవీ చూడండి: ఔరా చిన్నారి: 22 రోజుల్లోనే రామాయణం లిఖించే.!