వరంగల్ నగరంలోని మార్కెట్లో పండ్ల(Fruits) ధరలు మండిపోతున్నాయి. కరోనా(Corona) వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరు రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు పండ్లను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో దాదాపు అన్ని పండ్ల ధరలు 30 శాతం పెరిగాయి. వేసవిలో వచ్చే సీజనల్ పండ్లు రేటు కూడా అమాంతం పెరిగాయి. దీంతో సామాన్యులు పండు కొనాలంటేనే జంకుతున్నారు.
మంచి ఆరోగ్యం, పౌష్టికాహారం, విటమిన్లు, రక్త ప్రసరణ... అలసట లేకుండా శరీరాన్ని ఉత్తేజంతో ఉంచడానికి పండ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. పండ్లు తినడం వల్ల రక్త కణాలు సమృద్ధిగా పెరిగి ఆరోగ్యం బలపడుతుంది. ఇలాంటి అవసరాల నేపథ్యంలో పండ్లు కొనేవారు ఎక్కువ అయిపోయారు. ధరలు కూడా అదే స్థాయిలో పెరిగిపోయాయి. సామాన్యులకు కొన్ని రకాల పండ్లు అందని ద్రాక్షగా మిగిలిపోతున్నాయి. యాపిల్స్ కిలో 100 నుంచి 200, బత్తాయి డజను 40 నుంచి 100, దానిమ్మ కిలో 100 నుంచి 200, కివి డజను 300 నుంచి 600 వరకు ధరలు పెరిగాయి.
ఇదీ చదవండి: Raghu rama: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్తో ఎంపీ రఘురామ భేటీ