వరంగల్ జాతీయ సాంకేతిక విద్యా సంస్థ నిట్‌లో నూతన విద్యార్థుల కోసం రెండు వారాలుగా నిర్వహిస్తోన్న పరిచయ వేడుక కార్యక్రమం నేటితో ఘనంగా ముగిసింది. కొత్త విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు పొందిన 1100 మంది విద్యార్థులు ఈ వేడుకలలో పాల్గొన్నారు. చివరి రోజున విద్యార్థుల చిత్రలేఖన ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. ఈ రెండు వారాల పాటు నూతన విద్యార్థులను 18 విభాగాలుగా విభజించి నృత్యాలు, పాటలు, ఆత్మరక్షణ విద్యలు, చిత్రలేఖనం, ఫొటోగ్రఫీ వంటి విద్యలలో నిట్ నిర్వాహకులు శిక్షణ ఇప్పించారు. నూతన విద్యార్థులకు కళాశాల వాతావరణం అలవాటు కావడంతో పాటుగా వారిలో చదువుపై మక్కువ, ఆత్మస్థైర్యం పెంపొందించడానికి ఈ కార్యక్రమం ఉపకరిస్తుందని నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చూడండి : కలెక్టర్‌పై ట్విట్టర్లో యువకుడి అనుచిత వ్యాఖ్యలు