ETV Bharat / state

Etela: డబ్బులు తీసుకోండి.. మనస్సాక్షి ప్రకారం ఓటేయండి: ఈటల - ఈటల రాజేందర్​ వార్తలు

తెరాస నేతలు ఇచ్చే డబ్బు తీసుకొని, మనస్సాక్షి ప్రకారం ఓటేయండని మాజీ ఈటల రాజేందర్(Etela Rajender)​ అన్నారు. వరంగల్​ అర్బన్​ జిల్లా కమలాపూర్​లో పర్యటించారు.

Etela Rajender
ఈటల రాజేందర్
author img

By

Published : Jul 18, 2021, 4:18 PM IST

ఉప ఎన్నిక వస్తేనే ప్రభుత్వం సమస్యలు పరిష్కరిస్తోందని మాజీ ఈటల రాజేందర్​(Etela Rajender) అన్నారు. వరంగల్​ అర్బన్​ జిల్లా కమలాపూర్​లో పర్యటించారు. ఉప ఎన్నిక రాగానే కుల సంఘాల భవనాలు మంజూరయ్యాయని తెలిపారు. తనను ఓడించటానికి ఎన్నో కుట్రలు చేస్తున్నారని చెప్పారు. 2018 ఎన్నికల్లోనే తనను ఓడించేందుకు కుట్ర చేశారని ఈటల అన్నారు. తెరాస నేతలు తన ప్రత్యర్థికి డబ్బులు పంపించారని ఆరోపించారు.

సిద్దిపేటలో హరీశ్‌రావు చేసినట్లే తానూ హుజూరాబాద్‌లో చేశానని ఈటల రాజేందర్​ చెప్పారు. తెరాస నేతలు ఇచ్చే డబ్బు తీసుకోండి, మనస్సాక్షి ప్రకారం ఓటేయండని ఓటర్లకు సూచించారు. తనతో పాటు హరీశ్‌ రావు కోరలు పీకాలని కేసీఆర్‌ చూశారని అందుకే తనకు, హరీశ్‌రావుకు మంత్రి పదవి ఇవ్వొద్దని భావించారని తెలిపారు. మెజార్టీ సాధించి కూడ 3 నెలలు మంత్రివర్గ విస్తరణ చేయలేదని ఈటల గుర్తు చేశారు. పార్టీ హక్కుల గురించి నేను గళమెత్తిన తర్వాతే హరీశ్‌కు పదవి ఇచ్చారని ఈటల వ్యాఖ్యానించారు.

దుబ్బాక, హుజూర్​నగర్​, నాగార్జునసాగర్​ ఎన్ని హామీలు ఇచ్చారు.. ఎన్ని అమలయ్యయో శ్వేత పత్రం విడుదల చేయాలి. హుజూరాబాద్​లో కూడా హామీలు ఇస్తారు. ఇక్కడ ఇచ్చే హామీలు తప్పకుండా అమలు చేయాలి. హుజూరాబాద్​ నియోజకవర్గంలో గత మూడేళ్లుగా కొత్తగా పింఛన్లు ఇవ్వలేదు. రేషన్​ కార్డులు ఇవ్వలేదు.

-ఈటల రాజేందర్​, మాజీ మంత్రి

Etela: తెరాస డబ్బు తీసుకోండి.. మనస్సాక్షి ప్రకారం ఓటేయండి: ఈటల

ఇదీ చదవండి: నెల‌కు రూ.1.5 లక్షలు సంపాదించడం ఎలా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.