ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా.. వరంగల్ నిట్లో రెండు వారాలపాటు యోగా, వ్యాయామం, 2కే రన్ నిర్వహించనున్నట్లు నిట్ డైరెక్టర్ రమణారావు తెలిపారు. ఇందులో భాగంగా.. గురువారం ఉదయం.. నిట్ పరిపాలన భవనం నుంచి 2కే రన్ ప్రారంభించారు.
కరోనా వ్యాప్తి దృష్ట్యా రోగనిరోధక శక్తి పెంపొందించుకోవడానికి, శరీరాన్ని దృఢంగా ఉంచడానికి వ్యాయామం ఎంతో తోడ్పడుతుందని రమణారావు తెలిపారు.
- ఇదీ చూడండి: ఏసీపీ నర్సింహారెడ్డి అక్రమాస్తులు రూ.70 కోట్లు!