రాష్ట్రంలో కిసాన్ రైలును ప్రారంభించి దక్షిణ మధ్య రైల్వే మరో ముందడుగు వేసింది. వ్యవసాయ రంగానికి తోడ్పాటునందిస్తూ... రైతుల ఉత్పత్తులకు మంచి ధర అందించడానికి రాష్ట్రం నుంచి తొలి కిసాన్ రైలును సోమవారం ప్రారంభించింది. సికింద్రాబాద్ డివిజన్‌లోని వరంగల్ స్టేషన్ నుంచి బరసత్‌కు పనుపు లోడ్‌తో రైలు బయలుదేరింది. 10 పార్సిల్ వ్యాన్లలో(పీవీఎస్) 230 టన్నుల పొడి పసుపుతో పశ్చిమ బంగాల్ సీల్దా డివిజన్‌లోని బరసత్‌కు రైలు ప్రయాణమైంది.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి విజయవంతంగా కిసాన్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించింది. రైతుకు మరింత ప్రోత్సాహం కల్పిస్తూ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఆపరేషన్ గ్రీన్స్ టాప్ టూ టోటల్ కింద గుర్తించిన పండ్లు, కూరగాయలు కిసాన్ రైళ్ల ద్వారా రవాణా చేయనుంది. రైల్వే ఛార్జీలో 50 శాతం రాయితీని ప్రకటించింది.
ఇదీ చదవండి: సీఎం కేసీఆర్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ