వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం కడిపికొండలోని లక్ష్మీ గణపతి వైన్స్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనలో స్వల్పంగా ఆస్తి నష్టం జరిగింది. పర్మిట్ రూమ్లో నిల్వ ఉంచిన ఖాళీ అట్టపెట్టెలు పూర్తిగా దగ్ధమయ్యాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపుచేశారు. చుట్టూ పొగలు వ్యాపించడం వల్ల స్థానికులు కాసేపు ఆందోళనకు గురయ్యారు.
ఇదీ చూడండి: విపత్కర పరిస్థితుల్లో ఆత్మరక్షణతోనే దేశరక్షణ!