A private Company That Drowned The Pepper Farmer: హనుమకొండ జిల్లా నడికుడ మండలం కౌకొండ గ్రామానికి చెందిన రైతులను ఓ ప్రైవేటు కంపెనీ వంచించింది. తమ దగ్గర మిర్చి నారు తీసుకుని పండిస్తే, పంటను తామే కొంటామని నమ్మబలికింది. మేలు రకం మిర్చి క్వింటాకు 29వేలు చెల్లిస్తామని చెప్పినట్లు రైతులు చెబుతున్నారు. ప్రైవేటు కంపెనీ ప్రతినిధుల్ని నమ్మిన కర్షకులు మిర్చినారు తీసుకుని పంట సాగు చేశారు. రెండు నెలలు దాటినా.. నాటిన మొక్క నాటినట్లే ఎదుగుదల లేక ఎండిపోతుంది.
అప్పులు తెచ్చి క్రిమిసంహారక మందులు పిచికారి చేసినా ఫలితం లేదు. ప్రైవేటు కంపెనీకి మాయలో పడిన ఎకరాలకు రూ. 50వేల వరకు పెట్టుబడి పెట్టామని.. ఇప్పుడు నిండా మునిగినట్లు రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పైసా కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు. వ్యవసాయ అధికారులు తమను పట్టించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నాసిరకం నారును అంటగట్టిన కంపెనీపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఇవీ చదవండి: