ETV Bharat / state

'తెరాస సర్కార్‌కు బుద్ధి చెప్పేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు' - భట్టి విక్రమార్క వార్తలు

హనుమకొండ రైతు సంఘర్షణ సభలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క, ఉత్తమ్​ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఈ రెండు ప్రభుత్వాలు రైతులను మోసం చేశాయని ఆరోపించారు. తెరాస సర్కార్‌కు బుద్ధి చెప్పేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

batti vikramarka uttam kumar reedy
batti vikramarka uttam kumar reedy
author img

By

Published : May 6, 2022, 7:34 PM IST

Updated : May 6, 2022, 7:47 PM IST

కేంద్రంలోని భాజపా, రాష్ట్రంలో తెరాస రైతులను మోసం చేస్తున్నాయని పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌ కుమార్​ రెడ్డి మండిపడ్డారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని మోదీ గొప్పగా చెప్పారని... ప్రధాని నిర్వాకం వల్ల రైతుల ఆదాయం తగ్గి... ఖర్చు పెరిగిందని ఆరోపించారు. పెట్రోల్‌, డీజిల్, ఎరువుల ధరలు భారీగా పెరిగి సాగు భారమైందని తెలిపారు. హనుమకొండ ఆర్ట్స్​ కళాశాల మైదానంలో రైతు సంఘర్షణ సభలో ఉత్తమ్, భట్టి​ ప్రసంగించారు.

'తెరాస సర్కార్‌కు బుద్ధి చెప్పేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు'

'ఈ ఏడాది తామర తెగులు వల్ల మిర్చి రైతులు నష్టపోతే ఈ ప్రభుత్వాలు ఆదుకోలేదు. నాలుగేళ్లుగా రుణమాఫీ గురించి తెరాస ప్రభుత్వం మాట్లాడటం లేదు. దేశంలో పంటల బీమా అమలు చేయని ఏకైక రాష్ట్రం తెలంగాణ. ముస్లింలకు రిజర్వేషన్లు పెంచుతానని చెప్పి కేసీఆర్ మోసం చేశారు. కాంగ్రెస్‌ కార్యకర్తలను వేధించేవారికి హెచ్చరికలు జారీ చేస్తున్నాం. తెరాస సర్కార్‌ ల్యాండ్‌, సాండ్‌, మైన్స్‌, వైన్స్‌ మాఫియాగా మారింది.' - ఉత్తమ్​ కుమార్ రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు

వరంగల్ సభ చరిత్రలో నిలిచిపోతుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో వచ్చేందుకు ఈ సభ తొలిమెట్టని స్పష్టం చేశారు. తెరాస సర్కార్‌కు బుద్ధి చెప్పేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్‌ లక్షల కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు. లక్షల కోట్లు ఖర్చు అయ్యాయి కానీ... ఒక్క ఎకరానికి కూడా నీరు అందలేదని మండిపడ్డారు.

ఇదీ చదవండి : ఖబడ్దార్‌... పిచ్చిపిచ్చిగా మాట్లాడితే నాలుక చీరేస్తాం బిడ్డా.. : శ్రీనివాస్‌ గౌడ్‌

పెళ్లి కోసం ప్రేయసి పక్కా ప్లాన్​.. ప్రియుడి కండోమ్​కు రంధ్రాలు.. చివరకు...

Last Updated : May 6, 2022, 7:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.