ETV Bharat / state

Errabelli Dayakar Rao visited Warangal : వరంగల్​లోని లోతట్టు ప్రాంతాలను సందర్శించిన ఎర్రబెల్లి - తెలంగాణలో భారీ వర్షాలు

Errabelli Dayakar Rao visited Warangal : భారీవర్షాలతో అతలాకుతలమైన వరంగల్ నగరంలోని లోతట్టు ప్రాంతాలను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సందర్శించారు. అధికారులు అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ముంపు ప్రాంతాల ప్రజలను ముందుగానే హెచ్చరించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. పునరావాస కేంద్రాలను సంసిద్ధం చేయాలని రెస్క్యూ టీమ్స్ ని ఎల్లవేళలా సిద్ధంగా ఉంచుకోవాలని మంత్రి పేర్కొన్నారు.

Errabelli Dayakar Rao visited Warangal
Errabelli Dayakar Rao visited Warangal
author img

By

Published : Jul 25, 2023, 5:52 PM IST

Errabelli Dayakar Rao visited Warangal : వర్షాలు వరదల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పంచాయత్ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సూచించారు. అధికారులు అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ముంపు ప్రాంతాల ప్రజలను ముందుగానే హెచ్చరించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. పునరావాస కేంద్రాలను సంసిద్ధం చేయాలని రెస్క్యూ టీమ్స్ ని ఎల్లవేళలా సిద్ధంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు. వర్షపాతం, వరదలు, లోతట్టు ప్రాంతాల జలమయం, వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటి విషయాల గురించి తెలుసుకున్నారు.

అత్యవసర పరిస్థితుల్లో, రెస్క్యూ టీమ్స్, టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు తదితర అంశాలపై ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో గల ఆరు జిల్లాల కలెక్టర్లతో, వరంగల్ పోలీస్ కమిషనర్, వరంగల్ ఎస్పీలు, ఇతర అధికారులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాల పరిస్థితిని, వాళ్ళు తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలను ఆ జిల్లాల కలెక్టర్లు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెడ్ అలెర్ట్ వుందని ప్రజలకి ఏ సమస్య ఉన్నా అధికారులకు తెలియచేయాలని, ఏ సమయంలో ఏ సమస్య వచ్చినా వెంటనే అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాల్లో కల్పించి వారికి భోజన సదుపాయం కల్పించాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్, కమిషనర్ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఇతర అధికారులతో కలసి మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు వరంగల్ నగరంలోని వివేకానంద కాలనీ, సుందర్యనగర్ సాయిగణేష్ ప్రాంతాల్లో పర్యటించారు.

Man Stuck in Erra Vagu Live Video : ఎర్రవాగులో ఇరుక్కున్న వ్యక్తి.. చివరికి..!

'' పేద ప్రజలు ఇండ్లు లేక లోతట్టు ప్రాంతాలలో ఇండ్లు కట్టుకున్నారు వాటిని గతంలో తీసవేయాలని వచ్చినా ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని తీయలేదు. వీటి పరిష్కారం కోసం కాల్వలు ఏర్పాటు చేసి నీరు ఆగకుండా అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటాము. లోతట్టు కాలనీ ప్రాంత వాసుల కోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశాం. పునరావాస కేంద్రాల వద్ద తాగు నీటితోపాటు భోజనాన్ని అందిస్తున్నాము. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్న తెలియజేయాలి ధైర్యంగా ఉండాలి. వీటికి గతంలో నిధులు కూడా మంజూరు చేశారు. శాశ్వత పరిష్కారం కోసం సైడ్ డ్రైనేజీలను త్వరితగతిన ఏర్పాటు చేస్తాము.'' -ఎర్రబెల్లి దయాకరరావు, మంత్రి

Errabelli Dayakar Rao visited Warangal : వరంగల్ నగరంలోని లోతట్టు ప్రాంతాలను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సందర్శించారు. నగరంలోని ఎస్సార్ నగర్ తో పాటు వివేకానంద కాలనీ సాయి గణేష్ కాలనీ సుందరయ్య నగర్ ప్రాంతాలను కలెక్టర్ మరియు మేయర్ గుండు సుధారాణితో కలిసి ఆయన పర్యటించారు లోతట్టు ప్రాంత వాసులను అప్రమత్తం చేశామని ... లోతట్టు ప్రాంత వాసుల కోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు పునరావాస కేంద్రాల వద్ద తాగునీటితో పాటు భోజనాన్ని అందిస్తున్నామని తెలిపారు శాశ్వత పరిష్కారం కోసం సైడ్ డ్రైనేజీలను త్వరితగతిన ఏర్పాటు చేస్తామని అన్నారు.

వరంగల్​లోని లోతట్టు ప్రాంతాలను సందర్శించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

ఇవీ చదవండి.

Rains in Telangana : శాంతించని వరుణుడు.. జోరు వానలతో ఆగమవుతున్న తెలంగాణ

IMD Director Interview : 'మూడు రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు.. రెడ్​ అలర్ట్​ జారీ'

Hyderabad Rain : 'ఒకవైపు భారీ వర్షం.. మరోవైపు ట్రాఫిక్​'.. ప్రస్తుత హైదరాబాద్​ పరిస్థితి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.