వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు మిర్చి పోటెత్తింది. నాలుగు రోజులు సెలవులు అనంతరం తిరిగి ప్రారంభమైన మార్కెట్ యార్డుకు వివిధ జిల్లాల నుంచి సుమారు 80 వేలకు పైగా మిర్చి బస్తాలు వచ్చాయి.
పెద్ద సంఖ్యలో రైతులు మిర్చిని తరలించడంతో మార్కెట్ యార్డు ఎర్రబంగారంతో కళకలలాడుతోంది. వ్యవసాయ మార్కెట్‌లో రాష్ట్రంలోనే అత్యధిక ధరలు పలికాయని మార్కెట్ ఛైర్మన్ సదానందం వెల్లడించారు.
ఇదీ చదవండి: కరోనాతో ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు.. చికిత్స కోసం అప్పులపాలు!