ఆసియాలోనే అతిపెద్ద రెండో వ్యవసాయ మార్కెట్‌గా పేరు గడించిన వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ నెలరోజుల సెలవుల అనంతరం తిరిగి ప్రారంభం కానుంది. కరోనా వైరస్ ఉద్ధృతి దృష్ట్యా... సెలవులు ప్రకటించిన అధికారులు పెరిగే మార్కెట్ ఇవాల్టి నుంచి ప్రారంభమవుతుందని మార్కెట్ ఛైర్మన్ స్పష్టం చేశారు.
మార్కెట్లోని మిరప, పత్తి, పసుపు, అపరాల యార్డులను మార్కెట్ సిబ్బంది సోడియం హైపోక్లోరైట్ ద్రావణంతో శుభ్రం చేశారు. మార్కెట్‌కు మాస్కు ధరించిన వారిని మాత్రమే అనుమతిస్తామని... భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు చేపట్టామని మార్కెట్ ఛైర్మన్ సదానందం తెలిపారు.